telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌ : …పాక్ సరిహద్దులో సంయమనం పాటించాలి.. అమెరికా హెచ్చరికలు..

trump intermediate on india and pakistan

అమెరికా కశ్మీర్ అంశం భారత్-పాక్ ల ద్వైపాక్షిక అంశమేనని స్పష్టం చేసింది. సరిహద్దు వద్ద పాక్ సంయమనం పాటించాలని హెచ్చరించింది. జమ్మూకశ్మీర్ ప్రజలపై కొనసాగుతున్న ఆంక్షలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆంక్షల వల్ల ప్రభావితం అవుతున్న అక్కడి ప్రజలతో మాట్లాడి మానవహక్కులను గౌరవించాలని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కశ్మీర్‌లో తిరిగి సాధారణ రాజకీయ పరిస్థితులు తీసుకువస్తామన్న భారత ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడు రోజుల క్రితం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో సమావేశమై జమ్మూకశ్మీర్ అంశంపై మాట్లాడారు. 1947కు ముందు పాకిస్థాన్ భారత భూభాగంలోనే ఉంది కాబట్టి కశ్మీర్ అంశం ద్వైపాక్షికమేనని, ఈ సమస్య పరిష్కారానికి మూడో దేశం జోక్యం అవసరం లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts