ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చంద్రబాబు ఓ అడ్రస్ అంటూ లేకుండా చేశారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ కేబినెట్ లో చట్టం చేసేశాక కూడా రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని బొత్స ప్రశ్నించారు.
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చారు. టీడీపీ సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అవినీతిని అరికట్టడానికి తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టిందని ఏపీ తెలిపారు. అయితే తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు అడుగుతారన్న భయంతోనే చంద్రబాబు రివర్స్ టెండరింగ్ పై గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు