జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాపతినిధులను కూడా కరోనా వైరస్ టచ్ చేస్తోంది. తాజాగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
బొంతు రామ్మోహన్ కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని వచ్చింది. మేయర్ రామ్మోహన్ గతంలో రెండుసార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అప్పుడు నెగెటివ్ రాగా ఈసారి మాత్రం పాజిటివ్ అని తేలింది.