గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో సైఫ్ కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. కాగా, సైఫ్ కు అయిన గాయాల్లో రెండు మరీ లోతుగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బాలీవుడ్ వర్గాలను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.