telugu navyamedia
సినిమా వార్తలు

నటుడికి షాకిచ్చిన కోర్టు… అత్యాచారం కేసు…

Karan-Oberai

ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ ఓ యువతిని రేప్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న కారణంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కరణ్ పై ఐపీసీ సెక్షన్ 376, 384 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మోడల్, నటుడు అయిన కరణ్ పెళ్లి పేరుతో సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అంతేకాకుండా సదరు యువతి అభ్యంతరకర ఫోటోలను, వీడియోలను బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరణ్ ఒబేరాయ్‌‌కి బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ని అంథేరీ న్యాయస్థానం తిరస్కరించడంతో మరో షాక్ తగిలింది. అదే విధంగా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ నెల 6న మొబైల్ యాప్ ద్వారా పరిచయం పెంచుకొని అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా అత్యాచారం చేసినట్లుకరణ్ పై ఒక మహిళ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో నటుడు కరణ్ ఒబెరాయ్ కి మద్దతుగా నిలిచింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజా బేడీ. కరణ్ పై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అత్యాచార చట్టాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మహిళలు శక్తివంతంగా, ధృడంగా ఉండాలని, మహిళా హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని తాను ఎప్పటినుండో వాదిస్తున్నట్లు.. ఇకపై పురుషుల హక్కులు ‘మెన్ టూ మూమెంట్’ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. తన స్నేహితులు కరణ్ తో కలిసి జీవించిన మహిళ ఇప్పుడు అతడిపై అత్యాచార కేసు ఫైల్ చేసిందని, దాని కారణంగా అతడి కెరీర్ నాశనమైందని, కుటుంబం ఎంతో క్షోభను అనుభవిస్తోందని తెలిపింది.

Related posts