telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

హైదరాబాద్ : నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉద్యోగం.. త్వరపడాలి..

good opportunity for un employed

సహారా స్వచ్ఛంద సంస్థ డైరక్టర్‌ ఆర్‌.నర్సింగ్‌రావు నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంబర్‌పేట తిరుమలనగర్‌లోని సంస్థ కార్యాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా టేలరింగ్‌, బ్యూటీ షియన్‌, మెహందీ, కంప్యూటర్‌ బేసిక్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఆర్టిఫిషల్‌ నగల తయారీ, చాక్లెట్‌ తయారీ తదితర రంగాల్లో మూడవ శిక్షణ తరగతులు ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి, ఉద్యోగ అవకావాలు కల్పి స్తామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత, మహిళలు సంస్థ కార్యాల యంలో కానీ, 94404 83089లో సంప్రదించాలని కోరారు.

ఇంకా అప్సా, టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అప్సా స్వచ్ఛంద సంస్థ మొబిలైజేషన్‌ కోఆర్డినేటర్‌ దేవేందర్‌ తెలిపారు. చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కంప్యూటర్‌ బేసిక్స్‌, కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌, టైపింగ్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్‌లలో నిపుణులైన అద్యాపకులతో మూడు నెలల పాటు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని వివరించారు.

పదవ తరగతి పాసైనవారు, ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయినవారు, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉద్యోగం చేస్తామనుకునే యువతి, యువకులు శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముషీరాబాద్‌ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి అప్సాటెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ స్మార్ట్‌ వృత్తి శిక్షణా కేంద్రంలో నేరుగా దరఖాస్తులు పొందవచ్చునని చెప్పారు. వివరాలకు ఫోన్‌ నంబర్లు 9949025230, 84980897 86లో సంప్రదించాలని కోరారు.

Related posts