ప్రస్తుతం తెలంగాణలో కరోనా కంటే కేవగా బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తూఉంది. అయితే ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కలవరపెట్టి… ఖమ్మంలోనూ వెలుగు చూసింది బ్లాక్ ఫంగస్.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఆందోళనకు గురిచేస్తోంది.. చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య కి బ్లాక్ ఫంగస్ ను గుర్తించారు వైద్యులు.. 20 రోజుల క్రితం కరోనాబారినపడిన ఆయన.. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. గత 10 రోజుల నుండి ఇంటి దగ్గర ఉంటున్నారు.. అయితే, రెండు రోజులుగా మొఖం, మెడలు ఉబ్బడంతో మళ్లీ కరీంనగర్ ఆసత్పికి తరలించారు కుటుంబ సభ్యులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బ్లాక్ ఫంగస్ గా గుర్తించి హైదరాబాద్ కు తరలించారు. ఇలా.. రోజు రోజుకూ బ్లాక్ ఫంగస్ బారినపడే బాధితులు తెలంగాణలో పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలను తీసుకుంటుంది. చూడాలి మరి దీనినైనా మొదట్లోనే ఆపగలమా… లేదా అనేది.
previous post

