పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం గోడపై ఉన్న జెండా కనపడకుండా ఆ మూడు రంగులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను వేయించారు. .
‘రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా వైసీపీ పాలన ఉంది. ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు వైసీపీ వాళ్ల రంగుల పిచ్చి ఆఖరికి జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చిందని ట్విటర్ లో పేర్కొన్నారు.
హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస: సీతారాం ఏచూరి