telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ: ఎంపీ ఈటల రాజేందర్‌

జూబ్లీహిల్స్‌లో ఆరు నెలల నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే జూబ్లీహిల్స్‌లో ఓడిపోయామన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ డబ్బులు, చీరలు పంపిణీ చేసి అధికార ధుర్వినియోగానికి పాల్పడి గెలించిందన్నారు.

కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు.

ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. సికింద్రాబాద్‌ గాయత్రి గార్డెన్స్‌ లో సోమవారం కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యురాలు బాణుక నర్మదతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

బిహార్‌లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమన్నారు. హైదరాబాద్ నగరంలో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఖాళీగా ఉన్న రెండు పడకల ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నారు. పేదల ఇళ్లను కూల్చొద్దని హైడ్రాను కోరారు.

నగరంలో బస్తీలు, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో పరిస్థితి దుర్భరంగా ఉందని, తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి మంత్రులు రెండేళ్లలో ఒక్క రివ్వ్యూ కూడా నిర్వహించలేదని ఆరోపించారు.

తాను స్వయంగా మంత్రి శ్రీధర్‌బాబు ఇంటికి వెళ్లి రైల్వే, స్థానిక సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చానని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో తాగునీటి కనెక్షన్లు, లిఫ్టులు లేవన్నారు.

Related posts