మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం రాష్ట్రానికి ఇచ్చిన ఆర్థిక సాయాన్ని కూడా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు ఖర్చు చేయలేక పోయిందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని కూడా ఖర్చు చేయలేక పోతున్నది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరం. ఇప్పటికైనా ఉద్ధవ్ థాక్రే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడని భావిస్తున్నానని ఫడ్నవీస్ చెప్పారు.