telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం: బీహార్ పీసీసీ

congress-logo

కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణమని బీహార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచారని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీలోని నలుగురు నాయకులతో పాటు, మిత్రపక్షాలే కారణమని చెప్పారు.

డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేశారని ఆరోపించారు. పార్టీ హైకమాండ్ ను చీకట్లో దాచేశారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర అగ్రనేతలను కలవకుండా అడ్డుకున్నారని అన్నారు.

Related posts