తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదో సీజన్‌కి సిద్ధమైంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుందని మా యాజమాన్యం గురువారమే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు కంటెస్టెంట్ల ఎంపిక కసరత్తులు పూర్తయి వారిని క్వారంటైన్ కు తరలించినట్టు తెలుస్తుంది.
సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుండగా ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. స్టార్ మా అలా ఈ ప్రకటన చేసిందో లేదో అంతలోనే షాకింగ్ న్యూన్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలోని ఐటీసీకి చెందిన ఓ ప్రముఖ హోటల్ లో క్వారంటైన్ లో ఉంచారు. కంటెస్టెంట్లలో కొందరికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యిందంటూ వార్తలు హల్చల్ చేస్తుంది. అఫీషియల్ గా అనౌన్సుమెంట్ అయితే రాలేదు.
నిజానికి ఎపుడో ప్రారంభంకావాల్సిన ఈ షో… కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ షో ప్రోమో ఇప్పటికే షూట్ చేసినట్లు .. స్వాతంత్య దినోత్సవ కానుకగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ షో మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్‌లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్‌లో ఎక్కువమంది లేడీస్ కంటెస్టెంట్లు ఉండనున్నారట.
షోలో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 22 నుండి క్వారెంటిన్‌లోకి వెళ్లిపోయారు. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే హౌస్ మేట్స్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కూడా పూర్తి చేసుకున్నాకే బిగ్ హౌస్ లోకి పంపనున్నారు.
ఇక కంటెస్టెంట్‌ల గురించి పక్కా క్లారిటీ లేదు కాని ఇందులో పాల్గొనబోయే ఫైనల్ లిస్ట్ ఇదే అని కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ , సింగర్ కోమలి, వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పేర్లు వినిపిస్తున్నాయి.