telugu navyamedia
సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, తరుణ్‌కు ఊరట

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి జగన్నాథ్, తరుణ్‌కు చెందిన రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ వారి నమూనాల్లో డ్రగ్స్ లేవని తేల్చేసింది. 2017 జులైలో దర్శకుడు పూరి, నటుడు తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

ఎఫ్ఎస్ఎల్ నివేదికలు గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్‌ శాఖకు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జిషీట్‌తో పాటు ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని ప్రధాన నిందితుడు కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. తరుణ్ సెప్టెంబర్ 22న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. తాజాగా ఇచ్చిన క్లీన్ చిట్ తో హాజరు అవుతారా లేదా? అనేది తేలాల్సి వుంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు వ్యవహారం అందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్‌తో మొదలైన ఈడీ విచారణ.. తనీష్ వరకు కొనసాగింది. బ్యాంక్ లావాదేవీలు, ముఖ్యంగా కెల్విన్‌ తో సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మనీలాండరింగ్‌, ఫెమా చట్టం ఉల్లంఘనపై ఆరా తీశారు.

Related posts