ప్రముఖ బంగ్లాదేశ్ నటి దారుణ హత్యకు గురైంది.. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన నటి రైమా ఇస్లాం షిము విగతజీవిగా ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే..
కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదంటూ రెండురోజులు క్రితం ఆమె భర్త షెకావత్ అలీ నోబెల్ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు జనవరి 16న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో రైమా కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. జనవరి 18న ఢాకాలోని కేరానీ గంజ్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహంను పోలీసులు కనుగొన్నారు.. రైమా శరీరంపై కనిపించిన గాయాలు గుర్తులను బట్టి రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త షెకావత్ ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించాడు. రైమా హత్యకు కుటుంబకలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైమా భర్తతోపాటు.. అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
1998లో ‘బర్తమాన్’ సినిమాతో కెరీర్ ఆరంభించిన రైమా సుమారు 25 చిత్రాల్లో నటించిన ఆమె పలు బుల్లితెరపై పలు టీవీ షోలు, సీరియళ్లలో నటిస్తూ వాటిని నిర్మించింది.

