మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు నేటితో తెరపడుతుంది. ఈ రోజు (అక్టోబర్ 10) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనుంది. అయితే తాజాగా ఈ టైమ్ ని 3గంటల వరకు పొడిగించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్టార్స్ హీరోలు.. చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి కుమార్, మంచు లక్ష్మీ, పోసాని, వడ్డే నవీన్, సుమ, రామ్ చరణ్, బాలకృష్ణ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ క్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న గోడవలపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై బండ్ల ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ మేరకు బండ్ల గణేశ్ సమాధానం ఇస్తూ.. గొడవలే కదా హత్యలు, అత్యాచారాలు ఏమి జరగడం లేదు కదా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని, తప్పకుండా ఎవరో ఒకరూ గెలుస్తారంటూ చమత్కరించాడు.


నాపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా..