telugu navyamedia
సినిమా వార్తలు

నేను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారు: బండ్ల‌ గణేశ్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు నేటితో తెరపడుతుంది. ఈ రోజు (అక్టోబర్‌ 10) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనుంది. అయితే తాజాగా ఈ టైమ్‌ ని 3గంటల వరకు పొడిగించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)​ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్టార్స్‌ హీరోలు.. చిరంజీవి, మోహన్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌, సాయి కుమార్‌, మంచు లక్ష్మీ, పోసాని, వడ్డే నవీన్‌, సుమ, రామ్‌ చరణ్‌, బాలకృష్ణ తదితరులు తమ ఓటు​ హక్కును వినియోగించుకున్నారు.

MAA Elections 2021: Bandla Ganesh Interesting Comments At Polling Center - Sakshi

ఈ క్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రం వద్ద జరుగుతున్న గోడవలపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై బండ్ల ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ మేరకు బండ్ల గణేశ్‌ సమాధానం ఇస్తూ.. గొడవలే కదా హత్యలు, అత్యాచారాలు ఏమి జరగడం లేదు కదా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని, తప్పకుండా ఎవరో ఒకరూ గెలుస్తారంటూ చమత్కరించాడు.

 

Related posts