telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మంత్రి మల్లారెడ్డి పై బలుమూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు..

Mallareddy Trs

మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రి ముందు ధర్నా చేస్తే… తప్పుడు కేసులు పెట్టారని..మల్లారెడ్డి మా పోరాటానికి తలొగ్గి… కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ ఇస్తామని నిర్ణయం తీసుకోవడం తమ విజయమన్నారు ఎన్ఎస్ యూఐ  రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్. ఆసుపత్రి భవనం మల్లారెడ్డిది కాదు… అవి ప్రభుత్వ భూములని ఆరోపించారు.  మంత్రి మల్లారెడ్డి అక్రమాలు బయట పెడతామని..పాల వ్యాపారం నుండి ఇంత పెద్ద వాడివి ఎలా అయ్యాడు..విడిచి పెట్టబోమని హెచ్చరించారు బలుమూరి వెంకట్. తాను ఎంబీబీఎస్ స్టూడెంట్ అని… డాక్టర్ లపై ఎందుకు దాడి చేస్తామన్నారు. డాక్టర్ లపై దాడి చేస్తే… వీడియోలు ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని.. దీనిపై సీఎం కెసిఆర్ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.  కరోనా తీవ్రత తగ్గుతున్న సమయంలో టాస్క్ ఫోర్స్ ఏం పని చేస్తుందని..మంత్రి మల్లారెడ్డి తమపై అక్రమంగా కేసులు పెడితే భయపడబోమని పేర్కొన్నారు.

Related posts