telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు.. 17 లక్షల 60 వేలు

balapur ganesh laddu auction started

బాలాపూర్ వినాయకుడి లడ్డూ ప్రసాదం వేలం పాటలో మరోసారి రికార్డు ధర పలికింది. ఈ రోజు ఉదయం బాలాపూర్ కూడలిలో జరిగిన వేలం పాటలో రూ. 17 లక్షల 60 వేలకు కొలను రాంరెడ్డి.. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లింగాల కొలను రాంరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కొలను రాంరెడ్డి మాట్లాడుతూ తొలిసారి బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతేడాది ఈ లడ్డూ రూ. 16.60 లక్షలకు శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో మొత్తం 19 మంది పాల్గొన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులు కూడా ఉన్నారు.

Related posts