ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు, పాపులర్ షోలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసుల్లో తిరుగలేని స్థానాన్ని సంపాదించుకుంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. నందమూరి బాలయ్య తో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో నూ హోస్ట్‌గా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ షో నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
నందమూరి బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తొలి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. విలక్షణ నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలెక్షన్ కింగ్.. డా.మంచు మోహన్ బాబు ఈ షో లో ఫస్ట్ గెస్ట్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు.
ఈ ప్రమోలో “నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు” అని చెప్పిన బాలయ్య డైలాగ్‌తో మొదలైంది. “ఎవరి జీవితం కళా ప్రపూర్ణమో, ప్రజాసేవ సంపూర్ణమో ఆయనే” అని బాలకృష్ణ డైలాగ్ చెప్పే సమయానికి మోహన్‌బాబు ఎంట్రీ ఇచ్చారు. ఛాదత్తం ఇంటర్‌డక్షన్ కాకుండానే వచ్చేస్తారు అని అంటారు. ఏంటీ మీరు ఇంకా కుర్రాడిలా ఉన్నారని బాలయ్య అంటారు..దీనికి సమాధానంగా ..ఎవరికి వయసు మీకు లేద వయసు అంటే..16 ఏళ్ళు అని బాలయ్య జవాబు ఇస్తారు.
మోహన్‌బాబు విచ్చేసి, హోస్ట్ బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు మోహన్‌బాబు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని మోహన్‌బాబును బాలయ్య అడిగారు. ‘పటాలం పాండు’ అని మోహన్‌బాబు సమధానమిచ్చారు. బాగా రాడ్ రంబోలా అంటూ బాలయ్య నవ్వులు పుయించారు.
“చిరంజీవి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయమేంటి?” అని బాలయ్య, మోహన్‌బాబును అడిగారు. “ఆయన అన్ని చూస్తుంటారు. నేను మాత్రం.. ” అంటూ మోహన్‌బాబు చెప్పారు. అన్నగారైన ఎన్టీఆర్‌గా తెలుగుదేశం పార్టీ స్థాపించారు కదా..ఆయన తదనంతరం ఆ పార్టీలు మీరు పట్టుకోకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారని మోహన్‌బాబు బాలయ్య ప్రశ్నించారు. ఆ ఒక్కటే అడగొద్దు అంటూ..మరీ అన్నగారి పార్టీ వదిలేసి వేరే పార్టీలో ఎందుకు చేరారు అని బాలయ్య ప్రశ్నవేస్తారు. ఒక ఆయన ఫిటింగ్ పెడుతుంటారు..అల్లు అరవిందే నీకు ప్రశ్నలన్నీ అడమని చెప్పంటాడు అని మోహన్ అంటారు. దీని బట్టి ఏదో ఆసక్తికర విషయం ఎపిసోడ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
“హీరోగా నిలబడాలనే ప్రయత్నంలో విఫలమవుతున్న రోజుల్లో ఎప్పుడైనా బాధపడ్డారా?” అని బాలయ్య అడగ్గా.. “తలుచుకుంటే ఏడుపొస్తుంది సోదరా.. పిల్లల కోసం చేస్తున్నాను. ఇల్లు అమ్మేశాను. ఎవరూ హెల్ప్ చేయలేదు” అని అన్నారు. చివర్లో మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు కూడా వచ్చి షోలో సందడి చేశారు. ‘జై బాలయ్య’ అని అన్న లక్ష్మీఅనగానే.. బాలయ్య వెంటనే ‘అన్‌స్టాపబుల్’ ..అనిపించింది అందం ..అనుకున్నది చెద్దాం అంటూ అభిమానుల్లో జోష్ తెప్పించారు.
కాగా ఈ షో తొలి ఎపిసోడ్ వచ్చే నెల అంటే నవంబర్ మాసం 4 వ తేదీన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రోమో అదిరి పోవడంతో .. ఈ షో ఎలా ఉండబోతుంది…? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.