telugu navyamedia
వార్తలు సామాజిక

రామ మందిర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం: మహావీర్ ట్రస్ట్

ayodya ready for deepostavam Guinness record

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా రామ మందిర నిర్మాణం ప్రారంభంకానుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న మహావీర్ మందిర్ ట్రస్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా ట్రస్టు కార్యదర్శి కిశోర్ కునాల్ మాట్లాడుతూ ఈ మొత్తాన్ని విడతల వారీగా అందజేస్తామని చెప్పారు. తొలి విడతగా రూ. 2 కోట్లు ఇస్తున్నామని.. దీనికి సంబంధించిన చెక్ తీసుకుని అయోధ్యకు వెళ్తున్నామని వెల్లడించారు. రూ. 2 కోట్లకు సంబంధించిన చెక్ ను మీడియాకు చూపించారు. తమ ట్రస్ట్ వద్ద రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయస్వామిలతో కూడిన 30 నాణేలు ఉన్నాయని తెలిపారు. వీటిని 1818లో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిందని కిశోర్ కునాల్ తెలిపారు. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం వీటిని దాచి ఉంచామని చెప్పారు.

Related posts