దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఈరోజు తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఓ ఆడపిల్లకు తండ్రిగా దీనిని సమర్థిస్తున్నానని తెలిపారు. దిశకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని, ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
సమాజంలో నైతిక విలువలు పాటించాలని, ప్రతి పురుషుడు మహిళకు రక్షణగా నిలవాలని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. గల్ఫ్ దేశాల్లో అయితే ఈ తరహా ఘటనల్లో నిందితులను రాళ్లతో కొట్టి హతమార్చుతారని వెల్లడించారు. మనదేశంలో చట్టాలను మార్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.


ఏపీలో ప్రతీకార రాజకీయాలు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు