భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియాతో పాటు చాలా దేశాలు భారత్‌ను రెడ్ లిస్ట్‌లో చేర్చాయి. విమాన రాకపోకలు రద్దు చేశాయి. దీంతో ఐపీఎల్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లగలమా? లేదా? అని తీవ్ర మధన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఆసీస్ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చార్టర్ విమానం ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్లేయర్ క్రిస్ లిన్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ తాము ఎలాంటి సాయం చేయలేమని ఆసీస్ ప్రధాని తేల్చేశాడు. ఐపీఎల్‌లో ఆడిన క్రికెటర్లంతా ప్రైవేట్‌గా ప్రయాణించారని, ఇదేమీ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా కాదన్నారు. అందుచేత ఆసీస్ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు. వారికి తిరిగి రావడానికి వారికున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి. ఇక్కడ వారే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను వారిని కోరేది ఒక్కటే…. వారు సొంత ఏర్పాట్లు చేసుకుని రావాలనే ఆఖరిగా చెబుతున్నా’అని స్పష్టం చేశారు.
previous post