telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ధన్యవాదాలు అక్షయ్‌ జీ… : అస్సాం ముఖ్యమంత్రి

Akshay-Kumar

గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాల కారణంగా అ‍స్సాంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాంకు కోటి రూపాయల విరాళం ప్రకటించి ఆదుకున్నాడు. ఇందుకు గాను అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్‌ ట్విటర్‌ వేదికగా అక్షయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. “ధ్యాంక్యూ అక్షయ్‌ జీ… అస్సాం వరదల బాధితుల కోసం రూ. కోటి రూపాయలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడూ అండగా నిలుస్తారు. అస్సాంకు మంచి స్నేహితుడైన మీకు ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వాలు ఉండాలి. మీ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లాలి” అని ట్వీట్‌ చేశారు. అక్షయ్‌ కుమార్‌ కరోనా కాలంలో రూ.25 కోట్లు దానం​ చేసి రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

Related posts