తన భర్త కనిపించడం లేదని, ఎవరికైన అతను కనిపిస్తే కేరళలోని కట్టప్పన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరింది నటి ఆశా శరత్. ఆమె చెప్పింది నిజమేనని అంతా భావించారు. ఓ న్యాయవాది పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారట. విషయం సీరియస్ కావడంతో ఇది సినిమా కోసం చేసిన ప్రచార వీడియో అని ఆశా తెలిపింది. ఈ అమ్మడు ప్రస్తుతం మలయాలంలో ఎవిడే అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర ప్రచార భాగంలో ఓ వీడియోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఆశా. దీంతో సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకోవాలంటూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అభిమానులు. భాగమతి చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించి అలరించిన నటి ఆశా శరత్. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నటి శోభన కూడా తన సినిమా కోసం చేసిన ప్రమోషన్ తో విమర్శల పాలైంది.
							previous post
						
						
					


కశ్మీర్ విభజనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు