telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మేం తలుచుకుంటే అచ్చెన్మాయడు సహా అందరూ వైసీపీలోకే..!

minister peddireddy on AP capital

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి..? రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా..? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కేంద్రంపై అంతా కలిసి పోరాడి సాధించాలని… రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమని మండిపడ్డారు. మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ 170 స్థానాలు గెలుస్తుందని… పంచాయతీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 90 శాతం విజయం వైసీపీదేనని.. మేం తలుచుకుంటే అచ్చెన్మాయడు సహా అందరూ వైసీపీలోకి వచ్చేసే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ తీసుకెళ్తామన్నారని…చంద్రబాబు హయాంలో ఏ సమస్య పైనైనా, ఒక్కసారైనా అఖిలపక్షం పెట్టారా..? అని నిలదీశారు.

Related posts