telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు షాక్.. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ap high court

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏపీలో మరింత హాట్‌టాపిక్‌గా మారిపోయింది. తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహరంలో జగన్‌ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చు అని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరిచింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చేసింది ఎన్నికల సంఘం. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా.. నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్టు.. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.

Related posts