telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వైద్యులపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు: డీజీపీ

mahender_reddy

సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై నాన్‌ బెయిలేబుల్‌ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ బారిన పడ్డ వారికి వైద్య సేవలందిస్తున్న వారిపై దాడుల నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, ఇతర అధికారులు, సర్వే సిబ్బందికి భద్రత నిమిత్తం మరిన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.

మండలాల వారీగా, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు, వైద్యులు, జీహెచ్ ఎంపీ అధికారులతో పోలీస్ -మెడికల్ వాట్సప్ గ్రూప్ , ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో మెడికల్ నోడల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామని వివరించారు. వీరంతా ఒకరికొకరు సమన్వయం చేసుకుని సర్వేలకు వెళ్లాలని సూచించారు.

Related posts