ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటులోమృతి చెందారు. హైకోర్టులో విధుల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో హైకోర్టు ప్రాంగణం విషాదంలో మునిగిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే హైకోర్టులో రాజశేఖర్ సహ ఉద్యోగులందరూ ఆసుపత్రికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఆయన ఇన్చార్జి రిజిస్ట్రార్ గా ఉన్నారు. రిజిస్ట్రార్ జనరల్ గా నిన్ననే ఓ మహిళాధికారిని నియమించారు. ఆమెకు బాధ్యతలను అప్పగించిన మరుసటి రోజే ఆయన మరణించారు.


ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోంది: యనమల