ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు.
అయితే రాజీనామాల ఆమోదంపై మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో పాటు కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు.
ఇదిలా ఉంటే… ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా కూడా ఫైనలైంది. కానీ పేర్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉండనుంది. కేబినెట్‌లో 10 మంది పాత మంత్రులే కొనసాగే అవకాశం ఉండగా.. కొత్తగా మరో 15 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు
మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది.. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చలు జరిపిన సీఎం.. ఆదివారం మరోమారు మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా సజ్జల రామకృష్ణారెడ్డి భేటి కానున్నారు.


రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది: యనమల