telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీడియాపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీలో మీడియాపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ మరీ ఇంత దిగజారిపోతారనుకోలేదు, రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తారా? మీకసలు సిగ్గుందా?’ అంటూ మండిపడ్డారు. మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి” అంటూ డిమాండ్ చేశారు.

విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పరిస్థితిని, దానిపై తల్లిదండ్రుల ఆందోళనను ప్రపంచానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెట్టారంటే మీ 8 నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుందని అంటూ విమర్శించారు. మీడియా స్వేచ్ఛను హరించాలని ప్రయత్నం చేసిన ప్రతి నియంత కాలగర్భంలో కలిసిపోయారని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Related posts