telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ నిరంతరాయ విద్యుత్ పథకంలో ప్రపంచ బ్యాంకు నిధులతో  ఏపీ లోని డిస్కంలు చేపట్టిన ప్రాజెక్టులను జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీ లోని విద్యుత్ పంపిణీ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కూడా మినహాయిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ బ్యాంకుల నిబంధనల ప్రకారం ఏపీ డిస్కమ్ లు చేపట్టే ప్రాజెక్టులను జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ప్రక్రియల నుంచి మినహాయిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ అయ్యాయి.రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన జ్యూడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ప్రక్రియలను ప్రపంచ బ్యాంకు, ఏఐఐబి బ్యాంకులు అంగీకరించనందున ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో  ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ఉన్నందున స్థానికంగా ఉన్న చట్టాలకు మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ సూచించిందని స్పష్టం చేసింది.

Related posts