ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జగనన్న విద్యాదీవెన స్కీం కింద ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది జగన్ ప్రభుత్వం. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉండాల్సి కానీ ఆ డబ్బులు రాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ కొంత ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ తొలి ఏడాది విద్యార్థుల దరఖాస్తు పూర్తి కానందున వాయిదా వేసినట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ నెల 16న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని స్పష్టం చేసింది. నవరత్నాలులో భాగంగా ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. అర్హులైన విద్యార్థులందరికీ అన్ని కోర్సలకు విద్యాదీవెన కింద ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చాలా వరకు ఊరట కలుగుతోంది.
next post
పాఠశాల అపహాస్యమైతే విద్య నిరర్థకము!