కొనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున నారాయణ మూర్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు
1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన నగరం నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో తిరిగి టీడీపీ నుంచి పి. గన్నవరం నియోజకవర్గం నుంచి నారాయణమూర్తి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి కూడా దూరమయ్యారు..
నారాయణ మూర్తికి భార్య, ఐదుగురు పిల్లలు.. ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న ఆయన వివాదాలకు దూరంగా ఉన్నారు.
నారాయణ మూర్తి హఠాన్మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.నారాయణమూర్తి మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.


బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్: మాజీ ఎంపీ హర్షకుమార్