ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా శాఖల ఉద్యోగులకు ప్రతినెల చెల్లించే వేతనాలు ఆలస్యం కావడం పై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. జీతాలు చెల్లించకలేకపోవటానికి నిధుల కొరత కారణం కాదని పేర్కొంది. జీతాల ఆలస్యం పై టీవీల్లో ప్రసారమవుతున్న వార్తలు కొట్టిపారేసింది. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఇ-కుబేర్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతాయని తెలిపింది.
అదేవిధంగా అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాప్రకారం జూలై 31నే ఆర్బీఐకి పంపించినట్లు తెలిపింది. 1వ తేదీ మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించడం జరిగిందని స్పష్టం చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పనిచేయకపోవటం వల్లే మిగిలిన ఫైళ్లు చెల్లింపు ఆలస్యం అయిందని వెల్లడించింది.


ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపనే..