ఏపీలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని అన్నారు . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జనవరి 17 నుంచి కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. వైద్య శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించామని, ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని సీఎస్ తెలిపారు. చేశారు. ప్రతి విదేశీ ప్రయాణికుడిని ఐసోలేషన్లో ఉంచుతున్నామని పేర్కొన్నారు.