హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును నగర పోలీసులు చేధించారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను  బుధవారం అదుపులోకి తీసుకొన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.  అరెస్టయిన వారిలో మోను వాల్మీకి, చింతమల్ల ప్రణీత్ చౌదరి, చొకాలు ఉన్నారు. ఈ సందర్బంగా నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  గత నెలలో కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును సీరియస్ పరిగణించామని.. ఈస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారని వివరించారు.  ప్రణీత్ చౌదరి గూగుల్ పే ద్వారా నగదు లావాదేవీలు జరపడంతో వారిని అరెస్టు చేయడం సులువైందన్నారు. 


