మద్యం ప్రియులకు కాస్త ఊరట లభించిది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యాన్ని తెచ్చుకోనివ్వకుండా అడ్డుకుంటుండడంపై దాఖలైన రిట్ పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింద. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చని కోర్ట్ తెలిపింది.
అక్రమ మద్యాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో పోలీసులు, ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారులు మద్యాన్ని సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మద్యం ప్రియులు తెచ్చుకునే మద్యాన్ని కూడా అడ్డుకోవడంపై పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది.


జైలులో చిప్ప కూడు తినే వాళ్ళకు సీఎం పదవి..