telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులివే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి క్రిస్మస్‌, సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచింది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ఉంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది. క్రిస్మస్‌ సెలవులు   డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. డిసెంబర్‌ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. 

ఇక సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు ఇచ్చారు. జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. 16వ తేదీ ఆదివారం కావడంతో 17వ తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలకు మినహా మిగితా పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది .

 

Related posts