telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏలూరు వ్యాధిపై ఈరోజైన ఓ స్పష్టత వస్తుందా…?

గత కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధి ఏలూరులో ప్రతి ఒక్కరిని భయపెడుతున్నది. దాంతో వైద్యులు, నిపుణులు ఈ వ్యాధిపైనే దృష్టి పెట్టారు.  వ్యాధికి గల కారణాలు పరిశోధిస్తున్నారు.  ఎన్ఐఎన్, ఎయిమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ తదితర సంస్థలు అంతుచిక్కని వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నాయి.  ఈరోజు రిపోర్ట్ ఇవ్వబోతున్నాయి.  ఆయా సంస్థలు ఇచ్చే రిపోర్ట్ లను బట్టి ఈ వ్యాధి ఏంటి? ఎందుకు వచ్చింది? నీరే కారణమా లేదంటే మరేమైనా కారణమా అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.  నీటి పైపులు, చెరువులు చుట్టూ నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.  శరీరంలో కలుషితం తగ్గిపోవడంతో కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు.  ఈరోజు సాయంత్రం వరకు ఈ మిస్టరీని చెందించే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఏలూరు ఘటనపై ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  వింత వ్యాధి గురించిన వివరాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది.  ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు ఉంటారు.  ఇకపోతే ప్రస్తుతం 81 మంది బాధితులు ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.  

Related posts