డెయిరీ రంగంలో ప్రముఖ సంస్థ అమూల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా పాడిరైతులు ఆర్థికంగా ఎదగడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఈ ఒప్పందం ఓ గొప్ప అడుగు జగన్ పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామని అన్నారు. డెయిరీ రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ ముఖద్వారంలా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ సంస్థ తరఫున చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఏపీ పాడిరైతులకు మెరుగైన ధర దక్కనుంది. వినియోగదారులకు కూడా అందుబాటు ధరల్లో పాల ఉత్పత్తులు లభిస్తాయి.