ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరగా తాజాగా సోమవారం ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి శ్యామల తన భర్త నర్సింహారెడ్డితో కలసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ అన్న చేస్తున్న మంచి పనులు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు.
జగనన్న చేస్తున్న మంచి పనుల్లో స్వయంగా పాలుపంచుకోవాలనే వైసీపీలో చేరామని తెలిపారు. నవరత్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ పథకాలు తమకు ఎంతో నచ్చాయని వివరించారు. వైసీపీకీ మద్దతుగా తన భర్త కూడా వచ్చారని తెలిపారు. తాము వైసీపీ ప్రచారంలో పాల్గొంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.


చంద్రబాబు సెక్యూరిటీ పై స్పందించిన డీజీపీ