telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాక రేపుతున్న ప్రదీప్ భామ..

తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తెలుగు బుల్లితెరలో ఉన్న మేల్ యాంకర్లలో ఇతడి స్థాయే వేరు. యాంకర్‌గా ఉంటూ భారీ ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అతడి యాంకరింగ్ చూడటానికే కొందరు షోలు కూడా చూస్తారనడం అతిశయోక్తేమీ కాదు. అయితే మొట్టమొదటి సారి బుల్లితెర హీరో వెండి తెర పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రదీప్ ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రదీప్, అమృతా అయ్యర్ జంటగా నటించారు. ఈ సినిమాలో ప్రదీప్, అమృతా మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అమృతా అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ఈ అమ్మడు నిజ జీవితంలో సోషల్ మీడియాలో చాలా యక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజు స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానలను అలరిస్తుంటారు. అమృతా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అమృత చాలా క్యూట్‌గా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎరుపు, తెలుపు చెక్స్ డ్రస్సులో అమృతా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమ్మడు ఇంతకు ముందు విజయ్ దళపతి నటించిన బిగిల్, ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన రెడ్ సినిమాల్లో నటించారు.

Related posts