కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు.
ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రేపు ఉదయం 11:25లకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45కు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు.
అక్కడి నుంచి వినాయక్‌నగర్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఆయన ఉండనున్నారు. 2:35కు నిజామాబాద్ కంటేశ్వర్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి ధర్మపూరి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు.
2: 45 నిమిషాల నుంచి 4గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో జరిగే కిసాన్ మహాసభలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ ను ఇరికించమన్నారు.. చంద్రబాబు పై శశికుమార్ సంచలన వ్యాఖ్యలు!