telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమిత్ షా ఆదేశం.. గుజరాత్ కు ఎయిమ్స్ చీఫ్

amith shah bjp

గుజరాత్ లో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 7,402 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు 449 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. గుజరాత్ లో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తున్న తరుణంలో అమిత్ షా ప్రత్యేక దృష్టిని సారించారు. వెంటనే గుజరాత్ కు వెళ్లాలంటూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాను ఆదేశించారు.

అమిత్ షా ఆదేశాలతో డాక్టర్ గులేరియాతో పాటు మరో డాక్టర్ మనీశ్ సురేజా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో హుటాహుటిన గుజరాత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో డాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. కరోనా చికిత్సకు సంబంధించి పలు సూచనలు చేశారు.

Related posts