telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అందరూ ఎన్టీఆర్ కావాలంటున్నారు …

perni Nani ycp

తండ్రి గా చంద్రబాబు విఫలమయ్యారు…కొడుక్కి రాజకీయాలే కాదు కనీసం సంస్కారం కూడా నేర్పించలేకపోయారని అన్నారు. అందుకే బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నాయకులు నుంచి చిన్న కార్యకర్త వరకు అందరూ టీడీపీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ఎజెండాగా తీసుకుని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఏం చేశారని తిరుపతి ఓటర్లు మీకు ఓటెయ్యాలి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధాన్ని కూడా పక్కన పెట్టి జగన్ ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారని, తండ్రి, కొడుకులకు తిరుపతి ప్రజలు కరోనా బారిన పడినా పరవాలేదు అనే ధోరణి చూపిస్తున్నారని అన్నారు. నడ్డా వస్తారట, ఏమని ఓట్లు అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారు. యమధర్మరాజు ఎమ్ఎ పాత్రకు సునీల్ దియోధర్ పాత్రకు తేడా ఏమీ కనిపించటం లేదన్న ఆయన సునీల్ పెట్టుకుంటున్నది నామాలా? రాష్ట్రానికి పంగనామాలా? అని ప్రశ్నించారు.

Related posts