అల్లు అర్జునుకు హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఒక జాతీయ మీడియా సంస్థ తెలిపింది.
ఇందుకోసం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు పేర్కొంది.
సంధ్య థియేటర్కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని నిన్న ఓ రిపోర్టు బయటికి వచ్చింది.
దాని ఆధారంగా పోలీసులు హైకోర్ట్ లో వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ బెయిల్ రద్దయితే బన్నీ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉంది.