telugu navyamedia
సినిమా వార్తలు

హిందీ రీమేక్ లో వెంకీ

Venkatesh

టాలీవుడ్ సీనియర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌ ఇదివరకు మాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్ చిత్రాల‌ని రీమేక్ చేసి మంచి విజ‌యాలు అందుకున్నాడు. తాజాగా ఆయ‌న మ‌రో రీమేక్‌పై మనసు పారేసుకున్నట్ల తెలుస్తోంది. ఇటీవ‌ల హిందీలో విడుద‌లై మంచి విజయం సాధించిన “దేదే ప్యార్‌ దే”అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్, అల‌నాటి అందాల భామ ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “దేదే ప్యార్‌ దే” చిత్రం రూపొందింది. అకివ్ అలీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించారు. 50 ఏళ్ళ వ్య‌క్తి 26 ఏళ్ళ అమ్మాయితో లండన్‌లో ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాగే జ‌ర్నీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మంచి టాక్ రావ‌డంతో వెంకీ రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడట. సురేష్ బాబు తాజాగా వెంకీ “దేదే ప్యార్ దే” చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌బోతున్నాడనే విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. అతి త్వ‌రలోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

Related posts