దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఆలియా భట్, రామ్‌చరణ్‌పై ఓ పాట ఉంది. ఈ సాంగ్‌ను ఆలియా భట్‌తో పాడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అయితే తెలుగు, తమిళ భాషల పదాలను ఆమె ఉచ్ఛరించడం కష్టం కాబట్టి.. ఆ రెండు భాషల్లో వేరే వాళ్లతో పాడించి.. హిందీలో మాత్రం ఆలియాతో పాడించాలని అనుకుంటున్నారట. అలియా నటిగానే కాదు సింగర్‌గానూ ఫేమసే. హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా.. తదితర చిత్రాల్లో తన గానంతో అలియా అలరించింది. అయితే మరోసారి ఆమె తన గాత్రంతో ప్రేక్షకులకు మైమరపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. మరోవైపు ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన భీమ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది.
previous post
next post