అలంద మీడియా సంస్థ అడ్మిన్ సాయిసుధీర్, రవిప్రకాశ్ వద్ద తమ వాహనాలున్నాయని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ9 సీఈఓగా పనిచేసే సమయంలో ఉపయోగించిన సంస్థకు చెందిన ఖరీదైన కార్లు ఇప్పటికీ అతని వద్దనే ఉంచుకున్నారని, వాటిని తిరిగి సంస్థకు అప్పగించలేదన్నారు. సంస్థకు చెందిన సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర విలువైన వస్తువులు కూడా ఆయన వద్దే ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంటి వద్దకు వెళ్లి అక్కడున్న వాహనాలను పరిశీలించారు. గమనించిన రవిప్రకాశ్ భార్య, ఈ విషయంలో తమకు అలంద మీడియా సంస్థ నుంచి ఇప్పటికే నోటీసులు అందాయని పోలీసులకు వివరించారు. .. వాహనాలు సీజ్ చేయడానికి వీల్లేదన్నారు. చివరకు రవిప్రకాశ్ లేరని గుర్తించి వెనుదిరిగారు. దీనిపై తొలుత రవిప్రకాశ్‌కు నోటీసులు అందించాలని వారు భావిస్తున్నారు.