telugu navyamedia
National తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారు: ప్రశాంత్ కిశోర్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని, అప్పుడు ఆయనను వారి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ కాపాడలేరని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని, మరోసారి ఆయన గెలవడని జోస్యం చెప్పారు.

బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అని రేవంత్ రెడ్డి విమర్శించారని, అలాంటి వ్యక్తి ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను మూడుసార్లు ఎందుకు అడిగారో చెప్పాలని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు తాను ఏ అవకాశాన్నీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు.

Related posts